Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పతాగి ఎస్సైని బూతులు తిట్టిన యువతి.. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన వీడియో!

పీకలవరకు మద్యం సేవించిన 21 ఏళ్ళ యువతి పోలీసు స్టేషన్‌లో ఎస్సై‌పైనే బూతుల వర్షం కురిపించింది. అంతటితో ఆగకుండా చేయిచేసుకుని నానా రభస సృష్టించింది. ఈ ఘటన ముంబై నగరంలోని వోర్లీ పోలీసు స్టేషన్‌లో చోటుచేసుక

Webdunia
మంగళవారం, 28 జూన్ 2016 (13:11 IST)
పీకలవరకు మద్యం సేవించిన 21 ఏళ్ళ యువతి పోలీసు స్టేషన్‌లో ఎస్సై‌పైనే బూతుల వర్షం కురిపించింది. అంతటితో ఆగకుండా చేయిచేసుకుని నానా రభస సృష్టించింది. ఈ ఘటన ముంబై నగరంలోని వోర్లీ పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈ అమ్మాయి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వెళ్తూ దివైడర్‌ను గట్టిగా గుద్దేసింది. దీంతో కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి ఎక్కింది. ఓవర్ స్పీడ్‌లో వెళ్ళినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 
 
అరెస్ట్ చేసినందుకు నన్నేఅరెస్ట్ చేస్తారా.. అని పోలీసులపై అసభ్యంగా తిట్ల పురాణం కురిపించింది. దీంతో ఆ యువతిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషనుకు తీసుకొచ్చారు. కానీ స్టేషన్‌లోనూ ఆమె అదే సీన్ రిపీట్ చేసింది. పోలీసులను బూతులు తిడుతూ.. టేబుల్ మీది కంప్యూటర్‌ను, ఫోన్‌ను పగలగొట్టింది. విచారణ చేస్తున్న ఎస్సై లెంప వాయించింది. 
 
కుర్చీలో ఉన్న అతడిపై పదేపదే చేయిచేసుకుంది. దీంతో ఆ యువతి పక్కనే ఉన్న మరో ఇద్దరు యువకులు ఆమెను నియంత్రించేందుకు ప్రయత్నించారు. అయినా వారివల్ల కాలేదు. దీంతో ఆ యువతిని, ఆమె వెంట ఉన్న ఇద్దరు యువకులను ఖాకీలు అరెస్టు చేశారు. కస్టడీ తర్వాత ఈ ముగ్గురూ బెయిలుపై బయటపడ్డారు. ఈ ఉదంతం అక్కడున్న సిసిటివి కెమెరాలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో లీకై వైరల్‌గా మారింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments