Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలి తీర్చుకునేందుకు చోరీ.. చెప్పుల దండ వేసి, నగ‍్నంగా ఊరేగించారు...

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఇద్దరు మైనర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ముంబైలోని ఉల్హస్ నగర్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉల్హస్ నగర్‌లోని షాపులోంచి ఇద్దరు మైనర్లు ఆకలి బాధ తట్

Webdunia
సోమవారం, 22 మే 2017 (09:29 IST)
దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఇద్దరు మైనర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ముంబైలోని ఉల్హస్ నగర్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉల్హస్ నగర్‌లోని షాపులోంచి ఇద్దరు మైనర్లు ఆకలి బాధ తట్టుకోలేక తినుబండారాలను తిన్న పాపానికి షాపు యజమాని అవమానకరంగా.. అమానుషంగా ప్రవర్తించారు. బాలుర మెడలో చెప్పుల దండ వేసి, నగ‍్నంగా ఊరేగించారు.   
   
ఎనిమిది, తొమ్మిదేళ్ల సంవత్సరాల ఇద్దరు అబ్బాయిలు మెహమూద్ పఠాన్ (62) దుకాణంలోని చక్కిలాల ప్యాకెట్‌ను దొంగలించారు. దీన్ని గమనించిన పఠాన్‌, అతని ఇద్దరు కొడుకులు ఇర్ఫాన్ (25), సలీ(20)  వీళ్లపై విరుచుకుపడ్డారు. తీవ్రంగా కొట్టారు. ఆపై అరగుండు కొట్టించి.. మెడలో చెప్పుల దండ వేసి.. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఇంత అమానుష చర్య జరుగుతున్న ఎవ్వరూ పట్టించుకోలేదు. 
 
అయితే ఈ దృశ్యాలను స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments