Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక తప్పుడు ట్వీట్ నా జీవితాన్నే మార్చేసిందంటున్న ఆ పెద్దాయన. ఏమా కథ

రచయిత కాలమిస్టు శోభా డే చేత ట్విట్టర్‌లో అపహాస్యం పాలైన ఆ లావాటి పోలీసు ఎచ్టకేలకు తన ఊబకాయం సమస్యకు పరిష్కారం లభించిందని పొంగిపోతున్నారు. గురువారం ముంబైలో గ్యా్స్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న మధ్యప్రదేశ్ పోలీసు శాఖకు చెందిన జోగావత్ అనే పోలీసు అధి

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (07:03 IST)
రచయిత కాలమిస్టు శోభా డే చేత ట్విట్టర్‌లో అపహాస్యం పాలైన ఆ లావాటి పోలీసు ఎచ్టకేలకు తన ఊబకాయం సమస్యకు పరిష్కారం లభించిందని పొంగిపోతున్నారు. గురువారం ముంబైలో గ్యా్స్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న మధ్యప్రదేశ్ పోలీసు శాఖకు చెందిన జోగావత్ అనే పోలీసు అధికారి ఒక తప్పుడు ట్వీట్ నా జీవితాన్నే మార్చేసిందని సంబరపడిపోతున్నారు. కలలో కూడా ఉూహించని మంచి ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకునే అవకాశం పొందిన ఆయన తన సమస్యను పరిష్కరించుకోవడంలో సాయపడిన అంరరీకీ కృతజ్ఞతలు చెప్పారు.
 
 
విషయానికి వస్తే ముంబై మునిసిపల్ ఎన్నికల్లో బందోబస్తుకు వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసు ఎస్ఐ జోగావత్‌ భారీ ఆకారాన్ని చూసిన కాలమిస్టు శోభాడే  పోలింగ్ రోజున భారీ బందోబస్తు అంటూ ఆయన ఆకారాన్ని వెక్కిరిస్తూ ట్లీట్ చేశారు. వాస్తవంగానే జోగావత్ 180 కేజీల బరువు కలిగి ఉంటున్నారు. అనుకోకుండా శోభాడే ట్వీట్‌కు దొరికిన జోగావత్ తన శరీరంలో అసాధారణంగా హార్మోన్లు పెరగటంతో భారీ స్థాయిలో ఊబకాయం పెరిగిందిని ఆర్థిక స్తోమత లేక ఆపరేషన్ చేయించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఇక నెటిజన్ల విమర్శకు గురైన శోభాడే కూడా పోలీసు శాఖకు ప్రణామం చేస్తూ ఆసుపత్రికి వెళ్లి తప్పక నయం చేసుకోవాలని ఆయనకు సలహా ఇచ్చారు. ఈ విషయం తెలిసిన ముంబై సైఫీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ముఫజల్ లక్డావాలా  ఆయన బృందం జోగావత్‌ను సంప్రదించి ఆపరేషన్ నిర్వహించారు. 
 
ఆపరేషన్ జరిగిన 15 రోజులపాటు జోగావత్ ద్రవరూప ఆహారాన్నే తీసుకోవాలని మహిళా డాక్టర్ జోయా చెప్పారు. ఆహారం తీసుకోవడం ద్వారా పెరుగుతూ పోయిన  జోగావత్ పొట్ట సైజును తగ్గించేందుకు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేసామని చెప్పారు. 
 
ఆపరేషన్ మందు జోగావత్ మా్ట్లాడుతూ ఒక తప్పు ట్వీట్ నా జీవితాన్నే మార్చేసింది అంటూ సంతోషంగా వ్యాఖ్యానించారు. సహకరించిన మా సీనియర్ అధికారులకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ట్వీటర్‌లో నా పై వచ్చిన వ్యాఖ్యలకు బాధపడ్డానని, 1993లో మూత్రాశయ ఆపరేషన్ జరిగినప్పుడు హార్మోన్ డిసార్డర్‌తో శరీరం బాగా పెరిగిపోయిందని చెప్పారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments