షేవింగ్ బ్లేడ్‌తో సిజేరియన్.. తల్లీబిడ్డ మృతి.. ఎక్కడో తెలుసా?

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (19:28 IST)
Blade
గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్‌ను షేవింగ్ బ్లేడ్‌తో చేశాడు.. ఓ శారదా ఆస్పత్రి నిర్వాహకుడు. దీంతో తల్లీ బిడ్డ ప్రాణాలు కోల్పోయిన ఘటన యూపీలోని సుల్తాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుల్తాన్‌పూర్‌, సైని గ్రామంలోని మా శారదా ఆసుపత్రి నిర్వాహకుడు రాజేష్‌ సాహ్ని అనర్హులతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాడు. పూనం అనే నిండు గర్భిణీని డెలివరీ కోసం ఆమె కుటుంబ సభ్యులు ఆ క్లినిక్‌కు తీసుకొచ్చారు. 
 
ఈ నేపథ్యంలో 8వ తరగతి చదువును మధ్యలో ఆపేసి స్కూల్‌ మానేసిన రాజేంధ్ర శుక్లా అనే వ్యక్తి గడ్డం గీసుకునే బ్లేడ్‌తో ఆమెకు సిజేరియన్ ఆపరేషన్‌ చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆ మహిళ చనిపోయింది. కొంతసేపటి తర్వాత బిడ్డ కూడా మరణించింది. 
 
మహిళ భర్త రాజారామ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్లినిక్‌లో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవని, అనర్హులతో శాస్త్రచికిత్సలు చేసి రోగుల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. 
 
దర్యాప్తు చేసిన పోలీసులు దీనిని నిర్ధారించుకున్నారు. రాజేంద్ర శుక్లాతోపాటు రాజేష్‌ సాహ్నిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అక్రమ క్లినిక్‌లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని చీఫ్‌ మెడికల్‌ అధికారికి పోలీసులు లేఖ రాశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments