ఆన్‌లైన్ గేమ్స్ కోసం అప్పులు చేసింది.. ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్య

Webdunia
గురువారం, 29 జూన్ 2023 (11:24 IST)
ఆన్‌లైన్ గేమ్స్ కోసం అప్పులు చేసింది. ఆ బాధ తాళలేక ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మల్లికార్జున్‌నగర్‌కు చెందిన అవిశెట్టి మల్లేశ్ లారీ డ్రైవర్. ఇతడికి భార్య రాజేశ్వరి (28), పిల్లలు అనిరుధ్ (5) హర్షవర్ధన్ (2) ఉన్నారు. 
 
మంగళవారం సాయంత్రం భర్త ఇంట్లో లేనప్పుడు ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసిన రాజేశ్వరి.. తర్వాత తాను కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సంపులో ముగ్గురూ విగతజీవులుగా తేలుతూ కనిపించారు. దీంతో ఆమె భర్తకు సమాచారం ఇచ్చిన స్థానికులు.. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజేశ్వరి మొబైల్‌లో ఎప్పుడూ లూడో గేమ్స్ ఆడుతూ ఉండేదని.. ఈ క్రమంలో రూ.4లక్షల వరకు బంధువుల దగ్గర అప్పు తీసుకుందని స్థానికులు చెప్తున్నారు.
 
గేమ్స్‌లో అవి పోవడంతో అప్పుల వారి నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో అప్పు తీర్చే దారి లేక పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుని చేసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments