Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..

సెల్వి
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (21:59 IST)
జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో సంభవించిన తీవ్ర వాతావరణ సంఘటనలు భారతదేశం అంతటా కనీసం 1,528 మంది ప్రాణాలను బలిగొన్నాయి. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలు అత్యంత దెబ్బతిన్న రాష్ట్రాలలో ఉన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం తెలిపింది. 
 
ఇందులో 935 మంది వరదలు, భారీ వర్షాల కారణంగా మరణించగా, 570 మంది పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలకు గురయ్యారు. మరో ఇరవై రెండు మంది ప్రతికూల వాతావరణం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇందులో మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 290 మంది మరణించారు. వీరిలో వరదలు. భారీ వర్షాల కారణంగా 153 మంది మరణించగా, పిడుగుల కారణంగా 135 మంది మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లో 141 మంది మరణించారు. వీరిలో దాదాపు అందరూ కుండపోత వర్షాల వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వలన మరణించారు. 
 
జమ్మూ కాశ్మీర్ తర్వాత 139 మంది మరణించారు. బీహార్‌లో 62 మంది మరణించారు, వీరందరూ పిడుగుపాటుకు సంబంధించినవారే. ఇందులో ఉత్తరప్రదేశ్ మరో తీవ్ర వరద ప్రభావితమైన రాష్ట్రంగా నిలిచింది. ఈ రాష్ట్రంలో 201 మంది మరణించారు. 
 
జార్ఖండ్‌లో 129 మంది మరణించగా, అత్యధికంగా 95 మంది పిడుగుపాటుకు గురయ్యారు. గుజరాత్‌లో 31 మంది, ఢిల్లీలో ముగ్గురు, ఒడిశాలో 36 మంది మరణించారు. ఇలా దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి చెందారని ఐఎండీ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

IMAXలో స్టార్ట్ అవతార్ హంగామా - భారీగా అడ్వాన్స్ బుకింగ్స్

భూత శుద్ధి వివాహ బంధంతో ఒక్కటైన సమంత - రాజ్ నిడిమోరు

Kandula Durgesh: ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, త్వరలో నంది అవార్లులు : కందుల దుర్గేష్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments