Webdunia - Bharat's app for daily news and videos

Install App

పగ తీర్చుకుంటున్న కోతి.. ముగ్గురు రైలు డ్రైవర్లపై దాడి..!

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (11:57 IST)
ప్రముఖ దర్శకేంద్రుడు రాజమౌళి 'ఈగ' చిత్రాన్ని తలపించే సంఘటన ఒకటి బీహార్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో పగలు, ప్రతీకారాలు మనుషులకే కాదు, జంతుజీవరాశులు అన్నిటికి ఉంటాయని మరోసారి రుజువైంది. బీహార్‌లో రైలు డ్రైవర్లపై పగపట్టిన ఒక కోతి, అక్కడికి వచ్చే ప్రతి డ్రైవర్‌పై దాడి చేసి తన ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది. 
 
వివరాల్లోకి వెళితే.. గత వారం బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా వాల్మికీ రైల్వే స్టేషన్ వద్ద ఓ కోతి గూడ్స్ రైలు కింద పడి మృతి చెందింది. ఇక అప్పటి నుంచి దాని తోబుట్టువు అయిన మరో కోతి రైలు డ్రైవర్లపై ప్రతీకారం పెంచుకుంది. దీంతో వరుసగా ముగ్గురు రైల్వే డ్రైవర్లపై కోతి దాడి చేసింది.
 
ఇద్దరు డ్రైవర్లను తోటి రైల్వే ఉద్యోగులు కోతి దాడి నుంచి రక్షించారు. మరో డ్రైవర్ రైలు క్యాబిన్‌లోనే ఉండి ప్రాణాలను కాపాడుకున్నాడు. మరో గూడ్స్ రైలు డ్రైవర్ పైనా దాడికి ప్రయత్నించింది. అతడ్ని కూడా రైల్వే సిబ్బంది కాపాడారు. 
 
కాగా, ఈ ఘటనల నేపథ్యంలో వాల్మికీ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైళ్లు ఆపే ముందే డ్రైవర్లను ఇక్కడి రైల్వే సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. ఈ సంఘట ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments