Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువనంతపురంలో కోతుల గోల.. తాళలేక 56ఏళ్ల మహిళ ఆత్మహత్య

కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో కోతుల గోల భరించలేక 56 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. పుష్పలత అనే మహిళ ఏడాది క్రితం భర్తను కోల్పోయింది. కూలి పని చేసుకుంటూ కొడుకును, క

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (15:07 IST)
కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో కోతుల గోల భరించలేక 56 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. పుష్పలత అనే మహిళ ఏడాది క్రితం భర్తను కోల్పోయింది. కూలి పని చేసుకుంటూ కొడుకును, కుమార్తెను పోషించుకుంటూ వచ్చింది. ఓ చిన్న రేకుల షెడ్డులో వారి నివాసం. కష్టపడి సంపాదించిన కూలీ డబ్బుతో పిల్లల కోసం ఆహారం వండిపెడితే అది కాస్తా కోతుల గుంపు ఎత్తికెళ్లిపోయేది.. ఇలా రోజూ కోతులతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ మహిళ విసిగిపోయింది. 
 
ఆహారంతో పాటు ఇంట్లోని వస్తువుల్ని, బట్టల్ని కూడా నాశనం చేసేవి. ఇంటిపై కప్పు సరిగా లేకపోవడంతో కోతుల గుంపు దగ్గర్లోని రబ్బరు చెట్ల నుంచి లోపలికి ప్రవేశించి వారికి నరకం చూపించేవి. వాటి బాధపడలేక తీవ్ర మనస్తాపం చెందిన పుష్పలత ఆత్మహత్యకు పాల్పడింది. కోతుల బాధతో ఇరుగు పొరుగు వారు ఖాళీ చేసి వెళ్లిపోయారు. కానీ పుష్పలత కుటుంబం మాత్రం ఆర్థిక స్తోమత లేకపోవడంతో అదే ఇంట్లో గడపాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments