Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడు: రాధాకృష్ణన్ నాణెం విడుదల

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (12:08 IST)
తల్లి జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అందుకే తనను ఉపాధ్యాడిగానే ప్రజలు గుర్తుంచుకోవాలని అబ్దుల్ కలాం అనేవారని ప్రధాని పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మరణార్థం ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాణెం విడుదల చేశారు. ఢిల్లీలోని మానెక్ షా ఆడిటోరియంలో శుక్రవారం గురుపూజోత్సవం నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమంలో ప్రధాని, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాణెం విడుదల చేసిన మోడీ.. తొమ్మిది రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. 
 
మోడీ మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదన్నారు. విద్యార్థుల వల్లే ఉపాధ్యాయులకు గుర్తింపు వస్తుందని చెప్పారు. గొప్ప వైద్యులైనా, శాస్త్రవేత్తలైనా వారి వెనుక గురువులు ఉంటారని ప్రధాని పేర్కొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments