Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు ఈ-మెయిల్ నుంచి ప్రధాన మంత్రి ఫోటో తొలగింపు

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (16:13 IST)
సుప్రీంకోర్టు నుంచి వెళ్లే అధికారిక ఈ-మెయిల్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో తొలగించబడింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి లాయర్లకు వెళ్లే ఈ-మెయిల్ కింద భాగంలో మోదీ ప్రచారం చిత్రం వుండేది. ప్రస్తుతం ఈ ఫోటోను తొలగించారు. 
 
ఇంతకు ముందు ఈ ఫోటోపై అత్యున్నత న్యాయస్థానం (ఎస్‌సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజిస్ట్రీ అభ్యంతరంపై తక్షణమే స్పందించిన నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ఆ ప్రచార చిత్రాన్ని తొలగించింది. ఆ ఫోటో బదులుగా సుప్రీంకోర్టు భవనం ఫోటోను ఉంచారు. 
 
దేశ 75వ స్వాతంత్ర్య అమృతోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారిక వెబ్‌సైట్ల, ఈ-మెయిల్స్‌లో 'సబ్‌కా సాత్, సబ్‌ కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్' నినాదంతో పాటు మోదీ ఫోటోతో కూడిన ప్రచార చిత్రాన్ని ఉంచుతోంది. 
 
కానీ న్యాయవ్యవస్థ కార్యకలాపాలతో సంబంధం లేని ఓ ఫోటోను సుప్రీంకోర్టు అధికారిక ఈ-మెయిల్‌ అడుగు భాగంలో పొందుపరచడం సరికాదని స్పష్టం చేసింది. వెంటనే ఆ బొమ్మని తీసి వేయాలని ఎన్‌ఐసీని ఆదేశించడంతో తొలగించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments