Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిసెప్షన్ వేదికపై భర్తకు మాజీ ప్రియుడిని పరిచయం చేసింది.. ఆపై కట్టిన తాళిని చేతిలోపెట్టేసింది?

కళ్యాణ మండపం వేదికపై తన భర్తకు ఓ వధువు మాజీ ప్రేమికుడిని పరిచయం చేయడంతో ఆ వివాహం రద్దు అయిన సంఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళ, త్రిసూరుకు చెందిన జంట ఇటీవల గురువాయూరప్పన్ ఆలయంలో వివ

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (13:09 IST)
కళ్యాణ మండపం వేదికపై తన భర్తకు ఓ వధువు మాజీ ప్రేమికుడిని పరిచయం చేయడంతో ఆ వివాహం రద్దు అయిన సంఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళ, త్రిసూరుకు చెందిన జంట ఇటీవల గురువాయూరప్పన్ ఆలయంలో వివాహం ద్వారా ఒక్కటైంది. ఇటీవలే వీరిద్దరికీ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకలో బంధువులు, స్నేహితులు హాజరరయ్యారు. ఆ సమయంలో వేదికపైకి వచ్చిన ఓ వ్యక్తిని.. వధువు తన మాజీ ప్రేమికుడని వరుడికి పరిచయం చేసింది. దీంతో కోపావేశానికి గురైన వరుడు.. తన మెడలో వున్న పూలమాలను తీసిపారేశాడు. 
 
వధువుపై పెద్దగా అరిచాడు. దీన్ని చూసిన వారంతా వేదికపై ఏం జరిగిందనే విషయం తెలియక షాక్ అయ్యారు. ఆపై వరుడి వద్ద విచారించడంతో అసలు విషయం బయటపడింది. వధువు పెళ్లికి ముందే ఒకరిని ప్రేమించిందని.. వివాహ రిసెప్షన్ వేడుకలో తనకు పరిచయం కూడా చేసిందని.. ఈ అమ్మాయి ఇక తనకొద్దని మండిపడ్డాడు. అప్పటికే వివాహం జరిగిపోవడంతో.. వరుడు, వధువు తరపు వారు కూర్చుని మాట్లాడుకున్నా ఫలితం లేకపోయింది. 
 
వధువు పెళ్లికి ముందే ప్రేమలో వున్న విషయం తెలియరావడంతో ఆమెతో కాపురం చేసేది లేదంటూ వరుడు తేల్చి చెప్పేశాడు. అంతేగాకుండా తాను కట్టిన తాళిని, వధువుకు తీసిచ్చిన లక్ష రూపాయల విలువైన సెల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో వధువు వేరేదారి లేక ఆ వరుడు కట్టిన తాళిని, సెల్ ఫోన్‌ను తిరిగిచ్చేసింది. అంతటితో ఆగకుండా.. వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
పెళ్ళికి ముందే ప్రేమించిన విషయం దాచి, తనకు వివాహం చేసిన వధువు కుటుంబీకులపై కేసు పెట్టాడు. తనకు నష్టపరిహారంగా రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. కానీ రూ.లక్షలు వరుడికి ఇవ్వలేమని... రూ.8లక్షలు వరుడికి నష్టపరిహారంగా ఇస్తామని వధువు తల్లిదండ్రులు అంగీకరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments