Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ అత్యాచారం.. అరెస్టు

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (09:50 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ గిరిజన బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్‌లో దన్వైద్ దినకర్ (24) అనే వ్యక్తి బ్యాడ్మింటన్ కోచ్‌గా ఉన్నాడు. బిజాపూర్‌లోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు కొందరు బ్యాడ్మింటన్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో జనవరి 29న సమీపంలోని దినకర్ నిర్వహించే బ్యాడ్మింటన్ కోర్టుకు వెళ్లారు. సాయంత్రం విద్యార్థులందరూ తిరిగి వచ్చినా ఓ బాలిక మాత్రం తిరిగి స్కూలుకు రాలేదు. 
 
దీనిపై సహచర విద్యార్థినులు పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ఆ బాలిక కోసం గాలించారు. చివరికి ఆమె జగదల్‌పూర్‌లో పోలీసుల కంటపడింది. విచారణ సందర్భంగా ఆమె చెప్పినది విని పోలీసులు ఆశ్చర్యపోయారు. తోటి విద్యార్థులందరూ వెళ్లిపోయిన తర్వాత దినకర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం దినకర్‌ను అరెస్ట్ చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments