Webdunia - Bharat's app for daily news and videos

Install App

8 ఏళ్ల బాలికపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంటి బయట ఆడుకుంటుంటే..?

Webdunia
గురువారం, 15 జులై 2021 (16:58 IST)
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా కామాంధుల్లో మార్పు రావట్లేదు. వయోబేధం లేకుండా విరుచుకుపడుతున్నారు. అభంశుభం తెలియని పిల్లలకు మాయమాటలు చెప్పి వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో దారుణం జరిగింది. 8ఏళ్ల బాలికపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడో తరగతి చదువుతున్న బాలిక ఇంటి బయట ఆడుకుంటోంది. ఆ సమయంలో బాలికకు తెలిసిన వ్యక్తి అక్కడికి వచ్చాడు. బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
లైంగిక దాడి తర్వాత ఇంటికి చేరిన బాధిత బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. ఇది గమనించిన తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా విస్తుపోయే విషయం తెలిసింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు తేలింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన నేరాన్ని అతడు అంగీకరించాడు. నిందితుడికి భార్య కూడా ఉంది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం