Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 యేళ్ళ బాలుడిపై 23 యేళ్ల మహిళ అత్యాచారం... ఆపై వీడియో షూట్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంచలన కేసు నమోదైంది. 16 యేళ్ళ మైనర్ బాలుడిపై 23 యేళ్ల మహిళ అత్యాచారానికి పాల్పడింది. అత్యాచారం చేయడమేకాకుండా, తనను పెళ్లి చేసుకోవాలని కూడా ఆ మహిళ ఒత్తిడి చేసింది.

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2016 (10:21 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంచలన కేసు నమోదైంది. 16 యేళ్ళ మైనర్ బాలుడిపై 23 యేళ్ల మహిళ అత్యాచారానికి పాల్పడింది. అత్యాచారం చేయడమేకాకుండా, తనను పెళ్లి చేసుకోవాలని కూడా ఆ మహిళ ఒత్తిడి చేసింది. దీంతో ఆ మహిళపై బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోస్కో) సెక్షన్ 7, 8లు, ఐపీసీ 386 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ తరహా కేసు యూపీలో నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
సహరాన్ పూర్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 16 ఏళ్ల మైనర్ బాలుడిపై 23 ఏళ్ల మహిళ అత్యాచారం చేసింది. దీన్నంతా వీడియోగా తీసింది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. ఈ వీడియోను చూపించి బాలుడిపై పలుసార్లు లైంగికంగా వేధించిందని పోలీసులు చెప్పారు. తనను పెళ్లి చేసుకోకుంటే బాలుడితో గడిపిన వీడియో క్లిప్పింగును సోషల్‌ మీడియాలో పెడతానని మహిళ మైనర్ బాలుడిని బెదిరించిందని పోలీసులు తెలిపారు. 
 
ముందు బాధిత బాలుడి సోదరుడు మహిళ అత్యాచారం జరిపిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, నిందితురాలు మహిళ కావడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం మహిళపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సహరాన్ పూర్ స్టేషను ఆఫీసర్ పీయూష్ దీక్షిత్ చెప్పారు. మొత్తంమీద ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం