Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం..

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:23 IST)
కరోనాతో జనాలు ప్రాణాలు కోల్పోతున్నా.. కామాంధులు మాత్రం మారట్లేదు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతూనే వున్నారు. తాజాగా చెన్నైకి చెందిన ప్రభుత్వాస్పత్రి సమీపంలో మతిస్థిమితం లేని యువతిని ఐదురోజుల క్రితం ఆటోలో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ ప్రభుత్వాస్పత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో 15 రోజులుగా మతిస్థిమితం లేని 28 ఏళ్ల యువతి సంచరిస్తోంది. 
 
శనివారం అదే ప్రాంతంలో ఓ హోటల్‌ ముందు రక్తగాయాలతో, చిరిగిపోయిన దుస్తులతో పడి ఉండడాన్ని గమనించిన హోటల్‌ వంట మాస్టర్‌ పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని ఆమెను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. 
 
విచారణలో ఆమెను గత ఐదు రోజులుగా అదే ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆటోలో ఎక్కించుకొని శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి తిరిగి ఆ ప్రాంతానికి తీసుకొస్తుండేవారని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలుగురి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments