Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్దీ వేడుక తర్వాత స్నానానికి వెళ్లి శవమైన కనిపించిన వధువు

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (13:51 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో ఓ విషాదకర ఘటన జరిగింది. శుభకార్యంలో భాగంగా హల్దీ వేడుక తర్వాత స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్లిన వధువు శవమై కనిపించింది. దీంతో ఈ వివాహానికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అహ్మదాబాద్‌కు చెందిన మున్నీదేవి కుమార్తె గీత.. ఈమె ముజఫర్‌ నగర్‌లోని ఓ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంది. ఈమెకు ఈ నెల 7వ తేదీన బులంద్‌షెహర్‌కు చెందిన సుమిత్‌తో వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం హల్దీ వేడుక సందర్భంగా గీతకు కాళ్ళుచేతులు, ముఖానికి పసుపు పూశారు. ఈ వేడుక తర్వాత ఆమె స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లారు. 
 
ఆ తర్వాత ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపుకొట్టి పిలిచారు. లోపలి నుంచి ఎలాంటి శబ్దం లేదన స్పందన లేకపోవడంతో అనుమానించిన పోలీసులు.. బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా, గీత బాత్రూమ్‌లో అచేతనస్థితిలో కిందపడివుంది. ఆ వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. ఈ రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments