Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజ్రీవాల్‌పై ప్రతీకారం తీర్చుకున్న కమలనాథులు... ఢిల్లీలో బీజేపీ అఖండ విజయం

ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై కమలనాథులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరో మూడేళ్ల వరకు సమయం ఉన్నప్పటికీ... తాజాగా జరిగిన

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (13:49 IST)
ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై కమలనాథులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి మరో మూడేళ్ల వరకు సమయం ఉన్నప్పటికీ... తాజాగా జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయభేరీ మోగించింది. అలా కేజ్రీవాల్‌పై బీజేపీ ప్రతీకారం తీర్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవాన్ని తిప్పికొట్టింది. 
 
ఢిల్లీలోని మొత్తం మూడు కార్పొరేషన్లలోనూ మూడింట రెండొంతులకు పైగా మెజారిటీ సాధిస్తూ దూసుకెళ్తోంది. మొత్తం 272 సీట్లకు గాను 270 చోట్ల ఎన్నికలు జరగ్గా బీజేపీ అఖండ విజయాన్ని సొంతంచేసుకుంది. తూర్పు, ఉత్తర, దక్షిణ ఢిల్లీ మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకుంది. అంతేకాకుడా, ఢిల్లీ కార్పొరేషన్‌ను బీజేపీ వరుసగా మూడోసారి దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఇక రెండో స్థానం కోసం ఆప్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. 
 
మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తినడానికి ముందే కేజ్రీవాల్‌కు పంజాబ్, గోవా ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్‌ను జాతీయ పార్టీ చేయాలన్న ఆయన కలలు కల్లలయ్యాయి. ఎంసీడీ ఎన్నికల ఫలితాలతో ఇక ఆప్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ రెండో స్థానం వచ్చినా కూడా మొత్తం 272 స్థానాలున్న ఎంసీడీలో కేవలం 40కి కాస్త అటూ ఇటూగానే ఆప్ పరిమితం కావాల్సి ఉంటుంది. దాంతో కార్పొరేషన్‌లో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉండదు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మంచి ఫలితాలే సాధించినట్లవుతుంది. దాదాపు 40కి అటూ ఇటూగానే కాంగ్రెస్ కూడా ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments