Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షుద్ర పూజలు చేసి.. సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నారు..

దేశ రాజధాని న్యూఢిల్లీలో సామూహిక ఆత్మహత్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 11 మృతదేహాలు ఓ ఇంట్లో వెలికితీశారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో కొన్ని పుస్తకాల్లో క్షుద్ర పూజలు, మోక్షం

Webdunia
సోమవారం, 2 జులై 2018 (09:30 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో సామూహిక ఆత్మహత్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొత్తం 11 మృతదేహాలు ఓ ఇంట్లో వెలికితీశారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో కొన్ని పుస్తకాల్లో క్షుద్ర పూజలు, మోక్షం పొందేందుకు ఉన్న మార్గాల గురించిన విషయాలను గుర్తించారు. 
 
ఎలా మరణిస్తే మోక్షం లభిస్తుందని విషయాలు రాసుండటాన్ని చూసి అందులో చెప్పిన విధంగానే మృతదేహాలు వుండటంతో.. వీరి ఆత్మహత్యకు అదే కారణమని భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆ ఇంట్లో కొన్ని క్షుద్ర పూజలు జరిగినట్టు ఆధారాలు లభించాయని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మృతికి అసలు కారణాలు తెలుస్తాయని పోలీసు అధికారులు తెలిపారు. 
 
ప్రతి మృతదేహం కళ్లకు గంతలుకట్టి ఉండటం, నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు కట్టేసి ఉండటంతో, తొలుత ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యలుగా భావించినప్పటికీ, కుటుంబంలోని ఓ వ్యక్తి అందరికీ ఆత్మహత్య చేసుకునేందుకు సాయపడి, ఆపై తను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments