Webdunia - Bharat's app for daily news and videos

Install App

50 ఏళ్ల వ్యక్తితో 30 ఏళ్ల యువతికి పెళ్లైంది, పక్కింటి యువకుడితో కలిసింది, అంతే!!

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (20:13 IST)
భర్త తన కన్నా 20 సంవత్సరాల పెద్దవాడు. అతడితో తనకు ఆ పెళ్ళి ఇష్టం లేదని చెప్పినా కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసి పెళ్ళి చేశారు. దీంతో ఆమె నిస్సహాయురాలైంది. తనకంటే 20 ఏళ్లు పెద్దవాడయిన భర్త చాదస్తం ఎక్కువైంది. రాత్రివేళ తన కోర్కె తీర్చలేని భర్త ఎప్పుడూ నసుగుతూ వేధించడం మొదలుపెట్టాడు. ఆ అసంతృప్తిలో వున్న ఆమెకి పక్కింటి కుర్రాడి పరిచయం సంతోషాన్నిచ్చింది. అది కాస్తా సన్నిహిత సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత ఆ వివాహిత చివరకు కటకటాల పాలైంది.
 
పూర్తి వివరాలను చూస్తే... ఢిల్లీకి చెందిన 30 యేళ్ళ ప్రియాంకకు 50 యేళ్ళ వ్యక్తిని ఇచ్చి వివాహం చేశారు. పెళ్ళయి ఏడు నెలలే అవుతోంది. భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. బాగా డబ్బులున్నాయి. దీంతో ప్రియాంక తల్లిదండ్రులు ఆస్తి చూసి వయస్సును పట్టించుకోకుండా ఆమెకు బలవంతంగా పెళ్ళి చేసేశారు.
 
అయితే భర్త ఇంట్లో అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ చెప్పడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తనతో సమానంగా ఉన్న వయస్కుడిని పెళ్ళి చేసుకొని ఉంటే తన జీవితం బాగుండేదని అనుకుంది. దీంతో పాటు భర్త తన కోర్కె తీర్చకపోవడంతో మరింత నిరుత్సాహపడింది. ఇంటి పక్కనే తన కన్నా రెండేళ్ల తక్కువ ఉన్న కుర్రాడితో ప్రియాంక పరిచయం పెంచుకుంది.
 
అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఆ యువకుడు జాబ్ ట్రైలర్స్‌లో ఉన్నాడు. ఏ పని లేకపోవడంతో ప్రియాంకను కలవడమే పనిగా పెట్టుకున్నాడు. దీంతో ప్రియుడితోనే ఉండిపోవాలనుకుంది. భర్తను ఎలాగైనా చంపేయాలనుకుని నిర్ణయించుకుంది.
 
అన్నంలో మత్తు మందు కలిపింది. తిని పడుకున్న భర్తను దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తరువాత తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ చుట్టుప్రక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపితే అసలు విషయం బయటపడింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments