Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహం ఓ ఒప్పందం కాదు.. పవిత్ర కార్యం : ఢిల్లీ హైకోర్టు

వివాహం ఓ ఒప్పందం కాదనీ, ఓ పవిత్ర కార్యమని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. తనను చట్టబద్ధంగా పెళ్లిచేసుకున్న భార్యగా ప్రకటించేందుకు నిరాకరిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ దాఖలు చేస

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (09:11 IST)
వివాహం ఓ ఒప్పందం కాదనీ, ఓ పవిత్ర కార్యమని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. తనను చట్టబద్ధంగా పెళ్లిచేసుకున్న భార్యగా ప్రకటించేందుకు నిరాకరిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో తన భర్త పారిశుద్ధ్య ఉద్యోగిగా పనిచేస్తూ మృతి చెందినందున కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలని, తన భర్తకు లభించే ప్రయోజనాలను ఇప్పించాలని కోరుతూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. అయితే, మృతి చెందిన వ్యక్తికి భార్య ఉండగానే ఈ మహిళ మళ్లీ అతన్ని రెండో పెళ్లి చేసుకున్నందున చట్టరీత్యా ఆ వివాహం చెల్లదని దిగువ కోర్టు తీర్పునిచ్చింది.
 
అయితే, తన వివాహానికి సంబంధించి వివాహ ధ్రువీకరణ, ప్రమాణ పత్రాలను ఆధారాలుగా చూపింది. అయితే అతనికి అంతకుముందే పెళ్లయిందని, మొదటి భార్య 1994 మే11న మరణించిందన్న విషయాన్ని వెల్లడించలేదు. దీంతో దిగువ కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించగా.. హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు.. హిందూ చట్టం కింద పెళ్లనేది పవిత్ర ఆచారమంటూ ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments