హంగూ ఆర్భాటాలతో పెళ్ళిళ్లు అవసరమా..? ఏదైనా చట్టమొస్తే బాగుండు..

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (18:11 IST)
దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల ఫ్యాషన్ జరుగుతోంది. పెళ్లిళ్ల విషయంలో. యువతీ యువకులు భారీగా ఖర్చు పెట్టి, హంగూ ఆర్భాటాలతో పెళ్లిల్లు చేసుకుంటున్నారు. డబ్బున్న వారికైతే ఓకే కానీ.. అంతంత మాత్రంగానే ఉండేవారు కూడా అవనసరంగా అప్పులు చేసి మరీ బాగా ఖర్చు పెట్టి వివాహాలు చేసుకుంటున్నారు. దీని కారణంగా పెళ్లి తరువాత ఆ వధూవరుల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో పడిపోతున్నాయి.
 
మన దేశంలో ఇప్పుడు పెళ్లిళ్లు కూడా వ్యాపారంగా మారాయి. ఖరీదైన దుస్తులు, భారీ వేదికలు, పదుల సంఖ్యలో వెరైటీలు కలిగిన డిన్నర్‌.. ఇలా ప్రతి అంశంలోనూ వధూవరుల కుటుంబాలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. ఇక మన దేశంలో వధువు వరుడికి కట్నం ఇవ్వడం అన్న దురాచారం ఉండనే ఉంది. దాంతో వధువు తల్లిదండ్రులపై మరింత భారం పడుతోంది. 
 
ఇక మరోవైపు వరుడి కుటుంబంలోనూ ఆర్థికంగా లేకపోయినా పెళ్లి విషయానికి వచ్చే సరికి అప్పో సొప్పో చేసి మరీ భారీగానే వేడుకలకు ఖర్చు చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వివాహాలు చేస్తుండడం వల్ల తదుపరి కాలంలో పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు.
 
ఈ క్రమంలో ఈ విషయంపై పలువురు సామాజిక వేత్తలు కూడా స్పందిస్తున్నారు. ఇలా పెళ్లిళ్ల కోసం భారీగా ఖర్చు చేయకుండా, కొంత డబ్బు మాత్రమే ఖర్చు పెట్టేలా కొత్తగా ఏదైనా చట్టాన్ని తీసుకువస్తే అటు పేద, మధ్య తరగతి కుటుంబాలకు అనువుగా ఉంటుందంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments