Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి.. ఇటలీకి మర్చిపోలేని పీడ కల

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (14:06 IST)
కరోనా పేరు చెబితే ఆ దేశం చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా రాకాసి ఇటలీకి పీడకలలా కనిపించి, శాపంగా మారింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ దేశంలో ఇలాంటి మరణమృదంగం మోగడం ఇదే తొలిసారి.

పదులు కాదు, వందలు కాదు ఏకంగా 12వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వారి స్మారకార్థం ఇటలీ జాతీయ పతాకాలను అవనతం చేసింది. వాటికన్ సీటీ సైతం సంఘీభావంగా పసుపు, తెలుపు జెండాలను అవనతం చేసింది.

ఇటలీని తల్చుకుంటేనే కన్నీరు ఉబికివస్తోంది. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇటలీకి దేశానికి శాపంగా మారింది. మార్చిని ఎప్పటికీ మర్చిపోలేని నెలగా మార్చేసింది. నేటికి 11,591 మంది కొవిడ్‌-19తో చనిపోయారు.

మరణించిన వారి స్మారకార్థం మంగళవారం ఇటలీ జాతీయ పతాకాలను అవనతం చేసింది. మౌనం పాటించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆ దేశంలో ఇలాంటి మరణమృదంగం మోగడం ఇదే తొలిసారి. ‘ఈ వైరస్‌ ఒక గాయం. అది దేశమంతా గాయపర్చింది’ అని రోమ్‌ మేయర్‌ వర్జీనియా రాగి మౌనం పాటించిన తర్వాత అన్నారు.

‘మనందరం కలసికట్టుగా దీనిని ఎదుర్కొందాం’ అని పేర్కొన్నారు. వాటికన్‌ సిటీ సైతం సంఘీభావంగా పసుపు, తెలుపు జెండాలను అవనతం చేసింది. ఫిబ్రవరి చివరి వారంలో మిలన్‌లో తొలి కరోనా కేసు గుర్తించారు.

ఆ తర్వాత ఈ వైరస్‌ దేశమంతా వ్యాపించింది. మూడు వారాలుగా అక్కడ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లక్ష మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు. ఐరోపా కూటమిలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇటలీ ఈ దెబ్బతో పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది.

ఏప్రిల్‌ మధ్య వరకు షట్‌డౌన్‌ కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మే చివరి వారం వరకు అక్కడ దుకాణాలు తెరిచే పరిస్థితి కనిపించడమే లేదు. ‘మా దేశాన్ని రక్షించుకోవాలంటే మేమంతా ఇళ్లకు పరిమితం అవ్వడమే మార్గం.

మా కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, సూపర్‌ మార్కెట్లలో పనిచేస్తున్న సిబ్బంది కోసం మేమిది చేయాల్సిందే’ అని రోమ్‌ మేయర్‌ అన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments