Webdunia - Bharat's app for daily news and videos

Install App

అణ్వస్త్రాలు పెట్టుకుని చేతులు కట్టుకుని ఎందుకు కూర్చోవాలి? పాక్‌కు మనోహర్ పారీకర్ పరోక్ష వార్నింగ్

భారత రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ అణ్వస్త్రాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మన వద్ద అణ్వస్త్రాలు పెట్టుకుని చేతులు కట్టుకుని ఎందుకు కూర్చోవాలని ఆయన అన్నారు. ఓవైపు పాకిస్థాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న త

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (10:02 IST)
భారత రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ అణ్వస్త్రాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మన వద్ద అణ్వస్త్రాలు పెట్టుకుని చేతులు కట్టుకుని ఎందుకు కూర్చోవాలని ఆయన అన్నారు. ఓవైపు పాకిస్థాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో పారికర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. 
 
తమంతట తాము ఎవరిపైనా ముందస్తుగా అణ్వస్త్రాలు ప్రయోగించబోమంటూ ఇన్నాళ్లూ భారత్ చెబుతూ వస్తోంది. దీనిపై మనోహర్ పారీకర్ స్పందిస్తూ... అసలు మనం ఎందుకు చేతులు కట్టుకుని కూర్చోవాలంటూ ప్రశ్నించారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని... ప్రభుత్వ అభిప్రాయం కాదన్నారు. 
 
మరోవైపు, తాను చేసిన వ్యాఖ్యలపై ప్రచారం ఎలా జరుగుతుందో కూడా పారీకర్ నవ్వుతూ చెప్పారు. భారతదేశం తన అణువిధానాన్ని మార్చుకుందని మీడియాలో వార్తలు వస్తాయన్నారు. అవసరమైతే భారత్‌పై అణుదాడి చేస్తామంటూ పాకిస్థాన్ బెదిరించేదని... మనం సర్జికల్ దాడులు జరిపిన తర్వాత పాక్ చాలా సైలెంట్ అయిపోయిందని మంత్రి గుర్తుచేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments