మణిపూర్‌ విరిగిపడిన కొండ చరియలు - 37కు చేరిన మృతులు

Webdunia
సోమవారం, 4 జులై 2022 (09:54 IST)
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ రాష్ట్రంలోని నోనీ జిల్లాలో రైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న చోట కొండ చరియలు విరిగిపడ్డాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 37కు చేరింది. 
 
జిరిబమ్‌-ఇంఫాల్‌ మార్గంలో తుపుల్‌ రైల్వే యార్డు వద్ద జరిగిన ఈ ఘటనలో ఇంకా 25 మంది కోసం అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. అయితే వర్షాలు ఈ గాలింపు చర్యలకు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రమాదం జరిగి నాలుగు రోజులు ముగుస్తుండటంతో ఆచూకీ లభించని వారంతా మృతి చెందివుంటారని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించుకున్నట్లు తెలుస్తోంది.
 
శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు 37 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని, వారిలో 24 మంది టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది, 13 మంది పౌరులు ఉన్నారని గౌహతిలోని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఆచూకీ లభించని ఆరుగురు జవాన్లు, 19 పౌరుల కోసం గాలిస్తున్నామని, చివరి వ్యక్తి దొరికేవరకు చర్యలు కొనసాగుతాయన్నారు. 
 
ప్రతికూల వాతావరణం, భారీ వర్షాలు ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నట్లు తెలిపారు. సైనిక బృందాలు, అస్సాం రైఫిల్స్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 13 మంది జవాన్లను, ఐదుగురు పౌరులను సహాయక సిబ్బంది రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments