Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల ఫలితాలు : మణిపూర్‌లో ఓడిన ఉక్కు మహిళ ఇరోం షర్మిల, గోవాలో లక్ష్మీకాంత్ పర్సేకర్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం ప్ర్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఉక్కమహిళగా పేరుగాంచిన ఇరోం షర్మిల ఓడిపోయారు. అలాగే, గోవాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (11:08 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం ప్ర్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఉక్కమహిళగా పేరుగాంచిన ఇరోం షర్మిల ఓడిపోయారు. అలాగే, గోవాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ పరాజయం పాలయ్యారు. 
 
వీరితోపాటు... మరో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వెనుకంజలో ఉన్నారు. వీరిలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్‌ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ రూరల్‌ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. 
 
పంజాబ్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థికెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ శిరోమణి అకాలీదళ్‌ నేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అమరీందర్‌ సింగ్‌ పాటియాలో స్థానంలో కూడా పోటీ చేస్తున్నారు. 
 
గోవా ముఖ్యమంత్రి, భాజపా అభ్యర్థి లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌ ఓడిపోయారు. మణిపూర్‌లో మానవహక్కుల కార్యకర్త ఇరోం షర్మిల ఓటమి చవిచూశారు. రాష్ట్రంలోని తౌబల్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆమెపై మణిపూర్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి ఓ ఇబోబి సింగ్‌ కేవలం 51 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 
 
మణిపూర్‌లో సైనిక దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 16ఏళ్లు నిరాహార దీక్ష చేసిన షర్మిల పీఆర్‌జేఏ పార్టీ స్థాపించి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments