Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్ల్ ఫ్రెండ్‌ను చూడకుండా ఉండలేకపోతున్నా.. వాహనానికి ఏ స్టిక్కర్ వాడాలి!

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (14:53 IST)
ముంబై మహానగరంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. లాక్డౌన్ అమలవుతోంది. రాత్రి పూట కర్ఫ్యూ అమల్లో వుంది. దీంతో అనేక ప్రేమికులు తమతమ ప్రియుళ్లు, ప్రియురాళ్లను కలుసుకోలేక పోతున్నారు. ఇలాంటివారిలో ఒకరు... తన ప్రేయసిని కలుసుకునేందుకు ముంబై పోలీసుల సాయం కోరాడు. తన ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. 'నా గర్ల్ ఫ్రెండ్‌ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఆమెను మిస్ అవుతున్నాను. అందుకే, బయటకు వెళ్లి ఆమెను కలవడానికి నేను నా వాహనానికి ఏ స్టిక్కర్ ఉపయోగించాలి?' అంటూ ట్వీట్ చేశాడు. 
 
దీనికి ముంబై పోలీసులు అంతే వేగంతో ఫన్నీగా సమాధానం ఇచ్చారు. 'ఇది మీకు చాలా అవసరం అని మేము అర్థం చేసుకున్నాము, కానీ దురదృష్టవశాత్తు ఇది మా నిత్యావసరాలు లేదా అత్యవసర వర్గాల పరిధిలోకి రాదు! దూరం హృదయాన్ని బాగా విశాలం చేస్తుంది. మీరు ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అలానే ఉండండి' అంటూ చెప్పారు. అంతేకాదు 'మేము మీ ఇద్దరూ కలిసి జీవితకాలం ఉండాలని కోరుకుంటున్నాము. అందులో ఇది ఒక దశ మాత్రమే' అంటూ ముక్తాయించారు. 
 
దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీనికి ట్విట్టర్ లో చాలా మంది స్పందించారు అందరూ, ముంబయి పోలీసులు ఇచ్చిన వేగవంతమైన, సున్నితమైన సమాధానం ఇచ్చినందుకు తెగ మెచ్చుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments