Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయలేదనీ మేడపై నుంచి తోసేసిన భర్త... ఎక్కడ?

ఎంతో సంతోషంతో వివాహ వేడుకకు వెళ్లిన ఓ వివాహిత.. చివరకు శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయి ఆస్పత్రిపాలైంది. దీనికి కారణం ఆమె భర్తే కావడం గమనార్హం. వివాహ వేడుకలో తనతో కలిసి డ్యాన్స్ చేయలేదన్న కోపంతో మేడపై న

Webdunia
బుధవారం, 17 మే 2017 (09:05 IST)
ఎంతో సంతోషంతో వివాహ వేడుకకు వెళ్లిన ఓ వివాహిత.. చివరకు శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయి ఆస్పత్రిపాలైంది. దీనికి కారణం ఆమె భర్తే కావడం గమనార్హం. వివాహ వేడుకలో తనతో కలిసి డ్యాన్స్ చేయలేదన్న కోపంతో మేడపై నుంచి భార్యను కిందికి తోసేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లా చిల్లాఘాట్ పట్టణ సమీపంలోని డిఘ్వాట్ గ్రామంలో జరుగుతున్న తన బంధువుల పెళ్లికి విశాఖ తివారీ (28) అనే మ‌హిళ తన భర్తతో కలిసి వెళ్లింది. ఈ పెళ్లి వేడుక‌లో 'కలేవా' అనే తంతు జరుగుతోంది. ఈ వేడుక‌లో అంతా డ్యాన్స్ చేస్తున్నారు. విశాఖ భ‌ర్త అజయ్ ఇతర అతిథులతోను కలిసి డాన్సు చేస్తున్నాడు.
 
త‌న భార్య విశాఖ కూడా డ్యాన్స్ చేయాలని ఆమెను కోరాడు. అయితే, ఆమె డ్యాన్స్ చేయ‌డానికి అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన భర్త.. ఆమెను మేడ మీద నుంచి కింద‌రు తోసేశాడు. దీంతో విశాఖకు రెండు కాళ్లు విరిగిపోయాయి. అంతేకాక‌, ఆమె తలకు, ఉదరభాగంలోను కూడా గాయాలయ్యాయి. ఆమె ప్ర‌స్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. 
 
ఈ కేసులో పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. భార్యను కిందకి తోసే సమయంలో భ‌ర్త మ‌ద్యంతాగి ఉన్నాడ‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పెళ్లి వేడుకలో ఒక్కసారి విషాదం నెలకొంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments