Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ మహిళ కోసం రంజాన్ ఉపవాసాన్ని వదిలేశాడు..

Webdunia
గురువారం, 30 మే 2019 (15:41 IST)
మతం కంటే మానవత్వం గొప్పదని ఓ వ్యక్తి నిరూపించాడు. సమాజంలో నీతి, నిజాయితీలు ఇంకా చావలేదని నిరూపిస్తూ, విలువలు ఇంకా బతికే ఉన్నాయనే దానికి తాజాగా జరిగిన ఓ సంఘటన రుజువు చేసింది. ఓ ముస్లిం వ్యక్తి మరో వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షను కూడా వదిలేశాడు. 
 
అత్యవసర పరిస్థితులలో ఉన్నటువంటి ఓ గర్భిణీ మహిళకు సహాయం చేయడానికి రాజస్థాన్‌కి చెందిన ఆ వ్యక్తి తన ఉపవాసాన్ని కూడా లెక్కచేయలేదు. సావిత్రి దేవి ఓ గర్భిణి. ఆమెకు అత్యవసరంగా రక్తం అవసరపడడంతో అష్రఫ్ ఖాన్ అనే వ్యక్తి తన మతానికి సంబంధించి పవిత్రమైన ఆచారాన్ని కూడా వదిలేసి రక్తాన్ని దానం చేశాడు. 
 
తమకు తెలిసినవారికి ఎవరికో బి నెగిటివ్ రక్తం కావాలంటూ వచ్చిన ఓ మెసేజ్ చూసిన అష్రఫ్ ఖాన్ వెంటనే స్పందించాడు. మెసేజ్‌లో అందించబడిన నంబర్ చూసి సదరు వ్యక్తికి కాల్ చేశాడు. అనంతరం పేషెంట్ ఉన్న ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశాడు. ప్రస్తుతం అష్రఫ్ చేసిన పనికి గానూ సమాజంలో ఆదర్శంగా నిలిచాడు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments