Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేధింపులు తాళలేక.. కన్నకూతురి ముందే భార్యను హతమార్చిన భర్త.. ఎక్కడ?

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కనివినీఎరుగని దారుణం చోటుచేసుకుంది. కన్నకూతురు ముందే తల్లిని అత్యంత దారుణంగా హతమార్చాడో కిరాతక భర్త. అనంతరం ఎంతో ధైర్యంగా నడుచుకుంటూ పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి హత్య విషయాన్ని

Webdunia
సోమవారం, 20 జూన్ 2016 (10:41 IST)
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో కనివినీఎరుగని దారుణం చోటుచేసుకుంది. కన్నకూతురు ముందే తల్లిని అత్యంత దారుణంగా హతమార్చాడో కిరాతక భర్త. అనంతరం ఎంతో ధైర్యంగా నడుచుకుంటూ పోలీస్‌ స్టేషన్‌ వెళ్లి హత్య విషయాన్ని పోలీస్‌లకు లొంగిపోయాడు. అతడు చెప్పిన విషయాన్ని విని పోలీసులు ఖంగుతిన్నారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఔరంగాబాద్‌లో అశోక్ లాల్(35), పూజ(25)లకు ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగింది. 
 
ఈ దంపతులిద్దరికి రెండు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. కాగా ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధల కారణంగా కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. చిన్నగా మొదలైన గొడవ కాస్త పెను తుఫానులా మారింది. భార్య తరచూ తనను వేధిస్తుండడంతో విరక్తిచెందిన భర్త ఆమెను హతమార్చాడు. కన్నకూతురు చూస్తుండగానే తన భార్యను కత్తితో పొడిచి చంపినట్టు పోలీసులకు వివరించాడు. 
 
ఆమె అరుపులు పక్కింటి వారికి వినిపించకూడదని నోట్లో గుడ్డలు కుక్కి, అంతేకాకుండా టీవీ సౌండ్ పెంచినట్టు పోలీసులకు వివరించాడు. రక్తపుమడుగులో పడి ఉన్న పూజ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments