Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయస్థానంలోనే భార్యను గొడ్డలితో హత్య చేశాడు.. ప్రేమించి పెళ్లి చేసుకుని?

న్యాయాన్ని పరిరక్షించే న్యాయస్థానంలోనే హత్య చోటుచేసుకుంది. కోర్టులోనే భార్యను భర్త గొడ్డలితో నరికి హతమార్చాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లా సింధూర్‌ పం

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (11:29 IST)
న్యాయాన్ని పరిరక్షించే న్యాయస్థానంలోనే హత్య చోటుచేసుకుంది. కోర్టులోనే భార్యను భర్త గొడ్డలితో నరికి హతమార్చాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లా సింధూర్‌ పంక్‌ గ్రామానికి చెందిన రమేష్‌ కంవార్‌, సంగీత చౌదరి (37)ని ప్రేమించి ఆరునెలల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లికి తర్వాత వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. 
 
తరచూ గొడవలు జరిగేవి. దీంతో భర్తనుంచి విడాకులిప్పించాలని సంగీత సంబల్ పూర్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం దంపతులిద్దరూ కౌన్సిలింగ్‌కు హాజరయ్యారు. వారికి న్యాయమూర్తులు కౌన్సిలింగ్ చేస్తుండగా, ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
దీంతో భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన రమేష్ గొడ్డలితో భార్య, ఆమె తల్లి లలిత, ఆమె అక్క కుమార్తె శివాని (4)పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంగీతను న్యాయమూర్తులు బుర్లా ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ సంగీత మృతి చెందింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments