Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో ఉడుకుతున్న అంబలి డబ్రాలో పడిన వ్యక్తి (వీడియో వైరల్)

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (15:40 IST)
Sambar
తమిళనాడు, మదురైలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉడుకుతున్న అంబలిలో ఓ వ్యక్తి పడిపోయాడు. అంతే తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. మధురైలోని పలంగానట్టిలో చోటుచేసుకుంది. పలంగానట్టిలో గ్రామ దేవత ఉత్సవాల్లో ఈ విషాదం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... గ్రామ దేవత ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాని కోసం వంటలు చేస్తుండగా ఆ ప్రాంతానికి మద్యం సేవించి ముత్తు కుమార్ అనే వ్యక్తి వచ్చాడు. అప్పటికే పీకల దాకా మద్యం మత్తులో మునిగి వున్నాడు. వెనుక నుంచి అంబలి డబ్రాలో పడిపోయాడు. 
 
మత్తులో ఉన్న ఆయనకు అది అంబలి డాబ్రాలోని వేడి కూడా తగలలేదు. పూర్తిగా ఆ డబ్రా మీదికి ఒరిగేసరికి, లేవడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. పక్కనే ఉన్న వంటలు చేస్తున్న వ్యక్తి పాటు చాలామంది అతడిని బయటికి తీయడానికి ప్రయత్నించారు. 
 
ఆ వేడి కారణంగా నరకయాతన అనుభవించాడు. అతడిని బయటికి తీయడానికి కాళ్లు, చేతులు, జుట్టు పట్టుకుని లాగారు. కానీ ప్రయత్నం విఫలమైంది. చివరకు ఏమీ చేయలేక అంబలి డబ్రాను గట్టిగా నెట్టేశారు. 
 
ఆ డబ్రా కింద పడటంతో ఆ వ్యక్తి బయటపడ్డారు. కానీ అప్పటికే చాలా గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి తరలిస్తుండగానే ముత్తుకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.  ఈ వీడియో మీ కోసం.. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments