Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో దారుణం.. రోగిపై ఆంబులెన్స్‌లో అత్యాచారం...

దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నగరం నేరాలు, ఘోరాలకు అడ్డాగా మారిపోతోంది. తాజాగా ఓ రోగి ఆంబులెన్స్‌లోనే అత్యాచారానికి గురైంది. మహిళా రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో ఓ కామాంధుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తె

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:10 IST)
దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నగరం నేరాలు, ఘోరాలకు అడ్డాగా మారిపోతోంది. తాజాగా ఓ రోగి ఆంబులెన్స్‌లోనే అత్యాచారానికి గురైంది. మహిళా రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో ఓ కామాంధుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ కామాంధుడు ఆంబులెన్స్ సిబ్బందిగా భావిస్తున్నారు. నగరంలోని బనశంకరి పరిధిలో రెండు రోజుల క్రితం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
బనశంకరి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు జబ్బు చేయగా, ఆస్పత్రికి తరలించేందుకు ఆమె భర్త ప్రైవేట్ అంబులెన్స్‌ను పిలిపించాడు. ఆమెను ఆంబులెన్స్‌లోకి ఎక్కించి బాధిత మహిళ భర్త డ్రైవర్‌ పక్కన కూర్చున్నాడు. అంబులెన్స్‌లో ఉన్న ఉద్యోగి సిద్ధరాజు బాధిత మహిళపై అత్యాచారానికి యత్నించగా, అంబులెన్సు ఆస్పత్రికి చేరుకోవడంతో అతని పన్నాగం ఫలించలేదు.
 
రెండు రోజుల అనంతరం అనారోగ్యం నుంచి కోలుకున్న ఆమె ఈ ఘటనను కుటుంబసభ్యులకు వివరించింది. దీంతో వారు బనశంకరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సిద్ధరాజును అదుపులోకి తీసుకున్నారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments