Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్‌ఫోన్ ఛార్జ్ కోసం ఇంటికొచ్చి రేప్ చేయబోయాడు.. బిగ్గరగా కేకలు పెట్టడంతో నిప్పంటించాడు..

అత్యాచారానికి సహకరించలేదన్న పాపానికి ఓ యువకుడు ఓ యువతికి నిప్పంటించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీకి చెందిన ఓ యువకుడు యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కానీ ఎంతసేపటికీ ఆ యువతి ప్రతిఘటి

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (16:06 IST)
అత్యాచారానికి సహకరించలేదన్న పాపానికి ఓ యువకుడు ఓ యువతికి నిప్పంటించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీకి చెందిన ఓ యువకుడు యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కానీ ఎంతసేపటికీ ఆ యువతి ప్రతిఘటించడంతో పాటు బిగ్గరగా కేకలు పెట్టడంతో ఆగ్రహానికి గురైయ్యాడు. అంతే  యువతిని నిప్పుకు ఆహుతి చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని షాహిగణేష్‌పూర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన.. అదే ప్రాంతానికి చెందిన యువకుడు సెల్ ఫోన్ ఛార్జ్ కోసమంటూ వెళ్లాడు. ఆ యువతి కూడా అతనిని నమ్మి సెల్ ఫోన్ తీసుకుని ఇంట్లోకి వెళ్లింది. దీన్ని అదనుగా తీసుకున్న యువకుడు ఇంట్లోకి ప్రవేశించి.. తలుపులేసుకున్నాడు. ఆపై ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. 
 
అయితే ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆవేశానికి గురైన యువకుడు యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు. యువతి కేకలు విన్న స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్స ఫలించక యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments