Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబోయే భార్యను బ్లేడుతో కోశాడు, ఎందుకు?

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (20:23 IST)
వారిద్దరికి నిశ్చితార్థం అయింది. మార్చిలో వివాహం చేసేందుకు పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. కాబోయే అల్లుడి హోదాలో యువకుడు అత్తగారింటికి రాకపోకలు సాగిస్తున్నాడు. పెళ్లికి ముందే అమ్మాయిని మంచిగా చూసుకుంటున్న అల్లుడిని చూసి అత్తమామలు పొంగిపోయారు.

తమ బిడ్డ అదృష్టవంతురాలంటూ మురిసిపోయారు. అయితే ఏం జరిగిందో తెలీదు గానీ.. ఆ యువకుడి ఉన్మాదిగా మారి కాబోయే భార్యపైనే హత్యాయత్నం చేశాడు. బ్లేడుతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడటంతో బాధితురాలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 
 
ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా పొట్టంగి సమితి పంచాయతీ పరిధిలోని చింతలగుడ గ్రామానికి చెందిన డుమురి ఖొరా కూతురు సుస్మితా ఖొరాతో సొంబయి గ్రామానికి చెందిన విశ్వనాథ్‌‌తో గతేడాది వివాహం నిశ్చయమైంది. ఈ ఏడాది మార్చి‌లో వారిద్దరికీ వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. కాబోయే భార్యను చూడాలన్న ఆత్రంతో విశ్వనాథ్ ఇటీవల అత్తారింటికి తరుచూ వెళ్తున్నాడు. నిన్న రాత్రి కూడా ఇదే మాదిరిగా వారింటికి వెళ్లి సుస్మితతో ముచ్చట్లు చెప్పాడు.
 
రాత్రి కావడంతో అక్కడే పడుకుని ఉదయం వెళ్లాలని అత్తమామలు విశ్వనాథంని కోరారు. సరేనన్న అతడు అందరితో పాటు అక్కడే పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ లేచి బ్లేడుతో సుస్మితా గొంతు కోసేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
సకాలంలో వైద్యం అందడంతో ఆమె కోలుకుంది. సుస్మిత తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సుస్మిత తన చిన్ననాటి స్నేహితుల గురించి ఎక్కువగా చెప్పడం, అందులో యువకులు కూడా ఉండడంతో జీర్ణించులోకపోయాడు. అందుకే ఆమెపై దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. అలాగే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments