వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ : మమతా బెనర్జీ ప్రభంజనం... సీపీఎంకు చెంపదెబ్బ

Webdunia
గురువారం, 19 మే 2016 (10:25 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభంజనం కొనసాగుతోంది. గురువారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. ముఖ్యంగా.. బెంగాల్ రాష్ట్రాన్ని రెండున్నర దశాబ్దాలుగా పాలించిన వామపక్ష పార్టీ సీపీఎం ఐదేళ్ల క్రితం కోలుకోలేని దెబ్బ తిన్నది. దీదీగా జనం పిలుచుకునే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేతిలో సీపీఎం మట్టి కరిచింది. 
 
అయితే ఈ దఫా అయినా సత్తా చాటుదామనుకున్న సీపీఎం నేతల ఆశలపై దీదీ నీళ్లు చల్లారు. సీపీఎంకే కాకుండా కేంద్రంలో అధికార బీజేపీకి గట్టి షాకిస్తూ గురువారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్‌లో దీదీ సత్తా చాటారు. మొత్తం 294 సీట్లలో 211 స్థానాలకు పైగా ఆ పార్టీ ఆధిక్యం సాధించింది. 
 
దీదీ సాధిస్తున్న ఈ విజయం అక్కడ ప్రభంజనమనే చెప్పొచ్చు. ఏళ్ల తరబడి ఆ రాష్ట్రాన్ని పాలించిన సీపీఎంకు కనీసం రెండో స్థానం కూడా దక్కే అవకాశాలు లేవు. సీపీఎం 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ అంతకంటే అధికంగా 40 సీట్లలో, భారతీయ జనతా పార్టీ ఏడు సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు

సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారా, ది గర్ల్ ఫ్రెండ్ స్ఫూర్తినిచ్చింది - హేషమ్ అబ్దుల్ వహాబ్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments