Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్యా రుణాలు పొందేందుకు సాయపడిన మన్మోహన్.. బీజేపీ ఆరోపణ

బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్‌ఫిషర్‌ అధిపతి విజయ్‌ మాల్యాకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సాయపడ్డారని భాజపా ఆరోపించింది. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణ

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (17:04 IST)
బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న కింగ్‌ఫిషర్‌ అధిపతి విజయ్‌ మాల్యాకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సాయపడ్డారని భాజపా ఆరోపించింది. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ ఇరకాటంలో పడింది.
 
ఇదే అంశంపై భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా మాట్లాడుతూ... నష్టాల్లో ఉందని తెలిసి కూడా ఆ కంపెనీకి రుణాలు ఇప్పించే విధంగా మన్మోహన్‌ వ్యవహరించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన పత్రాలను మీడియా ముందు చూపించారు. కింగ్‌ఫిషర్‌కు నిరర్థక ఆస్తులు ఉన్నాయని తెలిసి కూడా బ్యాంకులు ఆయనకు రుణాలు ఇచ్చేలా మన్మోహన్‌ సాయపడ్డారన్నారు. 
 
మునిగిపోతున్న ఓడ (కాంగ్రెస్‌), మునిగిపోతున్న ఎయిర్‌లైన్స్‌ (కింగ్‌ఫిషర్‌)కు సాయం చేసిందని వ్యాఖ్యానించారు. ముందు తీసుకున్న రుణాలు చెల్లించనప్పటికీ మాల్యా మళ్లీ మళ్లీ రుణాలు ఎలా పొందారని ప్రశ్నించారు. ఈ విషయంలో మాల్యాకు మాజీ ఆర్థికమంత్రి చిదంబరం సైతం సాయపడ్డారని ఆరోపించారు. ఆయనకు రుణాలు ఇవ్వాల్సిందిగా పదే పదే బ్యాంకులపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments