Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి ముందే లైంగిక పరీక్షలు ఎందుకు చేయరాదు : మద్రాసు హైకోర్టు ప్రశ్న!

Webdunia
శుక్రవారం, 29 ఆగస్టు 2014 (14:43 IST)
పెళ్లికి ముందే అబ్బాయి, అమ్మాయిలకు ఇంపోటెన్సీ (నపుంసకత్వం), ఫ్రిజిడిటి (లైంగిక సామర్థ్యం) పరీక్షలను ఎందుకు తప్పని చేయకూడదంటూ మద్రాసు హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్రానికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చెన్నైకు చెందిన ఎమ్మెస్సీ ఐటి చేసి ఓ యువతికి గత యేడాది జూన్‌లో వివాహమైంది. తన భర్త నపుంసకుడని తెలిసిన ఆమె విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 
 
ఈ పిటీషన్‌పై జస్టీస్ కృపాకరన్ విచారణ జరిపి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. పెళ్లికి ముందే కాబోయే భార్యాభర్తలకు లైంగి సామర్థ్య పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్రం ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా చట్టం రూపొందించడమో, సవరణ చేయడమో ఏదో ఒకటి చేయండని సూచించారు. తద్వారా పెళ్ళితో ఒక్కటయ్యే దంపతులు కలకాలం కలిసి జీవించేందుకు బాటలు వేయాలని కోరారు. 
 
అంతేకాకుండా, పెళ్లికి ముందు నపుంసకత్వాన్ని దాచే వారిపై చర్యలెందుకు తీసుకోవడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. నపుంసకత్వాన్ని దాచి పెళ్లి చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిని మోసం చేసినట్లేని కూడా కృపాకరన్ వ్యాఖ్యానించారు. అందువల్ల పెళ్లికి ముందే లైంగిక సామర్థ్య పరీక్షలు చేయడం వల్ల వారిలో ఉండే నపుంసకత్వంతో పాటు దీర్ఘకాల వ్యాధులు కూడా బయటపడతాయని పేర్కొన్నారు. 
 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి