Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం కోసం రూ.5,500 కోట్లు ఖర్చుపెట్టారట.. ఓటు ధర రూ.2వేలు?

ఎన్నికలంటేనే డబ్బు కుమ్మరించుకోవాల్సిందేనని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో డబ్బు బాగా కుమ్మరిస్తే ఓటర్లు ఓట్లేసేస్తారని.. రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా..

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (16:50 IST)
ఎన్నికలంటేనే డబ్బు కుమ్మరించుకోవాల్సిందేనని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో డబ్బు బాగా కుమ్మరిస్తే ఓటర్లు ఓట్లేసేస్తారని.. రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా.. నిజాయితీగా జరిగితే ప్రజలకు, ప్రజా సేవకులకు మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే డబ్బు లేనిదే ఎన్నికలు జరగదని.. యూపీ ఎన్నికలు మరోసారి నిరూపించాయి.

నోట్లు రద్దయ్యాక కూడా యూపీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రచారం కోసం రూ.5,500 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎంఎస్ సర్వేలో వెల్లడైంది. ఈ మొత్తంలో రూ.వెయ్యి కోట్లు ఓటుకు నోటుకోసమే ఖర్చు చేశారని తెలిసింది. ఒక్కో ఓటు విలువ సగటున రూ.750 అని తెలిపింది. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒక్క ఓటు పడటం కోసం రాజకీయ పార్టీ రూ.2వేలు ఇచ్చి ఓటును కొనుగోలు చేసినట్లు సీఎంఎస్ సర్వేలో వెల్లడి అయ్యింది. మూడింట ఒక వంతు మంది ఓటర్లు నగదు లేదా మద్యం స్వీకరించి, ఓటు వేశారని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి రూ.25 లక్షలు మాత్రమే ఖర్చు చేయవలసి ఉంటుంది. 
 
అయితే వారు చేసిన ఖర్చులో ఈ 25 లక్షల రూపాయలు సముద్రంలో నీటి బొట్టులాంటిదని తేలిపోయింది. ప్రచార కార్యక్రమాల్లో సాంకేతిక పరికరాలు, ఓటర్లు భారీగా డబ్బు పంచి పెట్టడం, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు, దుస్తులు పంపిణీ చేయడంతో భారీ మొత్తాన్ని రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. వీడియో వ్యాన్లు, భారీ తెరలను బహిరంగంగా పెట్టి ప్రచారం చేశారు. ఈ విధంగా చేసిన ప్రచారానికి రాజకీయ పార్టీలు దాదాపు రూ.600 కోట్ల నుంచి రూ.900 కోట్ల వరకు ఉంటుందని సీఎంఎస్ సర్వేలో తేలింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments