రేవంత్ రెడ్డి విజన్ విన్నాక విజ్ఞప్తిని తిరస్కరించలేకపోయా : ఆనంద్ మహీంద్రా

ఠాగూర్
బుధవారం, 10 డిశెంబరు 2025 (08:27 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి లక్ష్యాలు, విజన్ విన్నాక ఆయన విజ్ఞప్తిని కాదనలేక, స్కిల్ యూనివర్శిటీ చైర్మన్‌ బాధ్యతలను స్వీకరించినట్టు తెలిపారు.
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజంగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు వేడుకల్లో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. ఇందులో ఆనంద్ మహీంద్రాతో పాటు చిరంజీవి, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ, దీర్ఘకాలిక లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్‌ను రూపొందించారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు ఆయన అభినందనలు తెలిపారు. స్కిల్ యూనివర్శఇటీకి చైర్మన్‌గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరగా, అప్పటికే తాను టెక్ మహింద్రా వర్శిటీకి చైర్మన్‌గా ఉన్నందున కుదరదని చెప్పానని, కానీ, ఆయన విజన్ విన్నాక అంగీకరించిటన్టు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ బ్లూప్రింట్ చూశానని, ప్రజలనే కేంద్రంగా చేసుకుని దీనిని రూపొందించారని ఆయన ప్రశంసించారు. 
 
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సిబ్బారావు మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తోందన్నారు. దేశంలోనే వృద్ధిరేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. హైదరాబాద్ ఐకానిక్ నగరంగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు ఇపుడు హైదరాబాద్ ఒక గమ్యస్థానంగా మారిందన్నారు. నీతి ఆయోగ్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఉందని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments