Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు: మహిళా జైలు సూపరింటెండెంట్

మహిళా జైలు సూపరింటెండెంట్ రాసిన లేఖ మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. తమపై సీనియర్ల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ మహిళా సూపరింటెండెంట్ ఒకరు శివసేన శాసనమండలి సభ్యురాలు, హక్కుల కార్యకర్త అయిన నీలమమ్

Webdunia
గురువారం, 13 జులై 2017 (08:42 IST)
మహిళా జైలు సూపరింటెండెంట్ రాసిన లేఖ మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. తమపై సీనియర్ల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ మహిళా సూపరింటెండెంట్ ఒకరు శివసేన శాసనమండలి సభ్యురాలు, హక్కుల కార్యకర్త అయిన నీలమమ్ గోరేకు లేఖ రాశారు. దీనిని ఆమె ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అందజేసి విచారణ జరిపించాలని కోరారు. 
 
పెళ్లి చేసుకుంటానని నమ్మించి సీనియర్ అధికారి ఒకరు తనతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నారని లేఖలో ఫిర్యాదుదారు ఆరోపించారు. ఆ లేఖలో సీనియర్ల వేధింపులకు 60-70 మంది మహిళా సిబ్బంది గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గోరేకు తాను ఎటువంటి లేఖ రాయలేదని ఎస్పీ పేర్కొన్నారు. తనకు అందిన లేఖలో సీనియర్లు తమను లైంగికంగా ఎలా వేధిస్తున్నదీ, సంబంధం కోసం ఎలా ఒత్తిడి తీసుకొస్తున్నదీ వివరంగా ఉందని గోరే చెప్పారు. తాజా తేదీతో రాసిన ఆ లేఖలో సీనియర్ల వేధింపులకు 60-70 మంది మహిళా సిబ్బంది గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
లేఖలోని నిజాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించానని, అయితే ఆమె తనకు లేఖ రాసిన విషయాన్ని ఖండించారని పేర్కొన్నారు. దీంతో ఆమెపై ఎవరి ఒత్తిడో పనిచేస్తున్న విషయం అర్థమవుతోందన్నారు. ఆమె లేఖలో నిజముందని, ఆ విషయం తేల్చేందుకు విచారణ జరిపించాలని కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం