Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లగా వున్నావనీ హేళన చేశారనీ.. కుటుంబానికే విషం పెట్టింది...

మహిళలను కించపరిచినా.. హేళన చేసినా వారు ఏమాత్రం సహించలేరు. తాజాగా ఓ మహిళను నల్లగా వున్నావంటూ కొందరు హేళన చేశారు. దీంతో ఆ కుటుంబం మొత్తాన్నే హత్య చేసేందుకు ఆమె విషం పెట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (11:42 IST)
మహిళలను కించపరిచినా.. హేళన చేసినా వారు ఏమాత్రం సహించలేరు. తాజాగా ఓ మహిళను నల్లగా వున్నావంటూ కొందరు హేళన చేశారు. దీంతో ఆ కుటుంబం మొత్తాన్నే హత్య చేసేందుకు ఆమె విషం పెట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రగ్యా సువర్సే అనే మహిళను తన అత్తమామలు, ఆడపడుచులు గత కొద్ది కాలం నుంచి నల్లగా ఉన్నావంటూ వేధించసాగారు. వారి వేధింపులు, హేళనలు తట్టుకోలేని బాధిత మహిళ.. ఆ కుటుంబాన్ని హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. 
 
ఇటీవల తమ సమీప బంధువు నివాసంలో జరిగిన ఫంక్షన్‌లో అత్తమామలు, ఆడపడుచులను హత్య చేయాలని డిసైడ్ అయింది. పప్పులో విషం కలిపిన ఆమె మొదట అత్తమామలు, ఆడపడుచులకు ఇచ్చింది. 
 
దీంతో తొలుత విషంతో కూడిన పప్పును ఆరగించిన వారిలో నలుగురు పిల్లలు, ఒక పెద్దాయన ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత 120 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ప్రగ్యాను అదుపులోకి తీసుకుని వించారు. ఈ విచారణలో నేరాన్ని ఆమె అంగీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments