Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా టెస్టులు : మహిళ ప్రైవేట్ భాగాల నుంచి శ్వాబ్ సేకరణ!!

Webdunia
గురువారం, 30 జులై 2020 (18:32 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. చిన్నపాటి జ్వరం వచ్చినా, దగ్గు, జలుబు ఉన్నట్టయితే ఖచ్చితంగా కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తున్నారు. అలా ఓ మహిళ జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ వచ్చింది. దీంతో ఆమెకు కరోనా టెస్టు చేయించుకోవాలని కుటుంబ సభ్యులు సలహా ఇచ్చారు. ఇందుకోసం ప్రైవేట్ ల్యాబ్‌కు వెళ్లగా, అక్కడ ఉండే ఓ టెక్నీషియన్.. ఆ మహిళ ప్రైవేట్ భాగాల నుంచి శ్వాబ్ సేకరించాడు. ఈ విషయం బహిర్గతం కావడంతో ఆ టెక్నీషియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని అమరావతి జిల్లా బద్నేరా ప్రాంతంలోని షాపింగ్‌ మాల్‌లో పని చేసే ఓ వ్యక్తికి జూలై 24న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తనతో కాంటాక్ట్‌ అయిన మహిళను కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించాడు. అంతేకాదు.. ఈ నెల 28వ తేదీన ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌కు తీసుకెళ్లాడు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఆమె ముక్కు నుంచి శ్యాంపిల్‌ సేకరించి పరీక్షించి పాజిటివ్‌ వచ్చిందని రిపోర్ట్‌ ఇచ్చాడు.
 
తర్వాత బాధితురాలికి ఫోన్‌ చేసి మరోమారు పరీక్షించాలని, ఇందుకోస ల్యాబ్‌కు రావాలని కోరాడు. దీంతో ఆ మహిళ మరోమారు ల్యాబ్‌కు వెళ్లగా, ఆ టెక్నీషియన్ ఆ మహిళ ప్రైవేట్‌ భాగాల నుంచి శ్యాంపిల్‌ సేకరించి పరీక్షించి నెగిటివ్‌ వచ్చిందని చెప్పాడు. దీంతో అతడి తీరుపై అనుమానం వచ్చిన బాధితురాలు విషయాన్ని సోదరుడికి తెలిపి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments