Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంటల్లో కాలిపోతూ యువతిని గట్టిగా హత్తుకున్న యువకుడు

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (12:21 IST)
మంటల్లో కాలిపోతున్న యువకుడు ఒకరు ఓ యువతిని గట్టిగా హత్తుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మరఠ్వాడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థి ఒకరు తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంటల్లో కాలుతూనే తాను ప్రేమిస్తున్న యువతిని గట్టిగా హత్తుకున్నాడు. దీంతో ఆ యువతికి కూడా మంటలు అంటుకుని.. వారిద్దరూ మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ ఘటన యూనివర్శిటీలో సంచలనం సృష్టించింది. 
 
గజానన్ ముండే అనే యువకుడు యూనివర్శిటిలో తనతో పాటు చదువుతున్న యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే, ఆ యువతి మాత్రం అతని ప్రేమను నిరాకరించింది. పైగా, ఇటీవల పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తనను గజానన్ వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని మందలించారు. ఈ క్రమంలో ఆ యువతి తనను అన్ని విధాలుగా వాడుకుందని ఆరోపించారు.
 
ఈ నేపథ్యంలో ఆ యువతి ఒక్కటే ల్యాబ్‌లో ప్రాజెక్టు చేస్తుండగా, అక్కడకు వెళ్లిన గజానన్ ల్యాబ్ తలుపులన్నీ మూసివేసి.. తనతో పాటు తెచ్చుకున్న రెండు పెట్రోల్ బాటిళ్లలో ఒకటి తనపై పోసుసుకుని మరొకటి ఆ యువతిపై పోసి నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతిని గట్టిగా హత్తుకున్నాడు. దీంతో వారిద్దరూ మంటల్లో కాలిపోయారు. వీరిని ఆస్పత్రికి తరలించగా, వారిద్దరూ చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments