Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై వరద బాధితుల కోసం ముంబై సెక్స్ వర్కర్ల విరాళం రూ.లక్ష!

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2015 (14:14 IST)
పొట్ట కూటికోసం, కుటుంబ పోషణార్థం సెక్స్ వర్కర్లు తమ శరీరాన్ని అమ్ముకుంటారు. అలాంటి సెక్స్ వర్కర్లు... చెన్నై వరద బాధితుల కోసం తమ వంతు సాయం చేస్తున్నారు. ముంబైకు చెందిన కొందరు సెక్స్ వర్కర్లంతా కలిసి లక్ష రూపాయలను వసూలు చేసి చెన్నై వరద బాధితులకు విరాళంగా ప్రకటించారు. 
 
ఎంతో హీనంగా చూస్తూ సమాజానికి దూరంగా ఉంచుతూ వారిని చిన్న చూపు చూసే మనం ఈ సంఘటనతో వారి నుండి ఎంతో నేర్చుకోవాలి. అనుకోని పరిస్థితులో విధి రాత బాగోలేక ఈ పాపపు ఊబిలో చిక్కుకుపోయి అనుక్షణం నరకం అనుభవించే వారి మనుసులోని దయ కరుణను మాత్రం సమాజం ఎప్పుడు చూడలేకపోయింది. వారి పెద్ద మనసు చూసాక వారిని సెక్స్ వర్కర్లు అని కాకుండా సోషల్ వర్కర్లు అని పిలిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 
 
వాస్తవానికి సమాజం వారిని దూరంగా పెట్టినా.. తిరిగి అదే సమాజం కోసం వారు ఈ రకంగా స్పందించడం నిజంగా అభినందనీయం. సాటి మనిషికి సాటి మనిషే సహాయ పడాలనే వీరి తత్వానికి చేతులెత్తి నమస్కరించాలి. పైగా.. పూట గడిపుకునేందుకు తమ మా శరీరాన్ని మాత్రమే అమ్ముకుంటామేగానీ, మా మనస్సులను కాదని ఈ ఘటనతో వారు నిరూపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?