Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌పూర్‌ జిల్లాలో దారుణం.. పలుమార్లు అత్యాచారం.. పెళ్లి పేరుతో ప్రెగ్నెంట్ చేశాడు...

Webdunia
సోమవారం, 17 మే 2021 (11:22 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వైద్యురాలిపై నాగ్‌పూర్ ఐటీ కమిషనర్‌ అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె అశ్లీల ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతారని బెదిరించాడు. వివాహం చేసుకుంటానని చెప్పి నాగపూర్ ఆదాయ పన్నుశాఖ కమిషనర్ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరికి చెందిన నివాసి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డెరెక్ట్‌ ట్యాక్సెస్‌లో శిక్షణ నిమిత్తం 2019లో నాగ్‌పూర్‌ వెళ్లాడు. ఈ క్రమంలో నాగ్‌పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లగా అక్కడ పనిచేసే వైద్యురాలితో ఆయనకు పరిచయం ఏర్పడింది. తాను యూపీఎస్పీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు చెప్పడంతో వైద్యురాలికి తన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు.
 
తరువాత స్నేహం పెంచుకొని ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ సమయంలో మహిళ అశ్లీల చిత్రాలు కూడా తీశాడు. పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో గర్భవతి కాగా అబార్షన్‌ చేయించాడు. బాధితురాలు పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమె అశ్లీల ఫొటోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. 
 
దీంతో ఆమె పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్‌ 376 (2) కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. కాగా నిందితుడిని బెంగళూరులో పోస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని పోలీసులు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం