Webdunia - Bharat's app for daily news and videos

Install App

కయ్యానికి కాలు దువ్వే వాళ్ల కాళ్లిరగ్గొట్టాలంటే నో మేడ్ ఇన్ చైనా: హెడ్ మాస్టర్ల శపథం

ముంబైలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్‌ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మేడ్‌ ఇన్‌ చైనా’ పేరుతో ఉన్న ఏ వస్తువునూ కొనకూడదని పిల్లలకు పిలుపునివ్వాలని నిర్ణయించింది. సమావేశం ముగిసిన వెంటనే పాఠశాలలకు చేరుకున్న ప్రాధానోపాధ్యాయులు వెంట నే తమతమ విద్

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (02:53 IST)
ముంబైలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్‌ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మేడ్‌ ఇన్‌ చైనా’ పేరుతో ఉన్న ఏ వస్తువునూ కొనకూడదని పిల్లలకు పిలుపునివ్వాలని నిర్ణయించింది. సమావేశం ముగిసిన వెంటనే పాఠశాలలకు చేరుకున్న ప్రాధానోపాధ్యాయులు వెంట నే తమతమ విద్యార్థులకు తాము తీసుకున్న నిర్ణయం గురించి చెప్పారు. ఇక నుంచి చైనా వస్తువులేవీ కొనకూడదని విజ్ఞప్తి చేశారు. ఇది ఆదేశం కాదని.. దేశ శ్రేయస్సు కోసం మనమంతా అమలు చేయాల్సిన నిర్ణయమని, అందుకే విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.
 
చైనాలో ఉత్పత్తి అవుతున్న వస్తువుల్లో ఆ దేశ ప్రజలు వినియోగించుకుంటున్నవి పోగా మిగిలినవాటిలో 80 శాతం వస్తువులు భారత్‌కే ఎగుమతి అవుతున్నాయి. అంతేకాక చైనా కంపెనీలు భారత్‌లోనూ మకాం వేసి, వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. ఫలితంగా వేల కోట్ల రూపాయల మనదేశ సంపదను చైనా చేతుల్లో పెడుతున్నాం. దాదాపు అనధికార లెక్కల ప్రకారమే రోజుకు రూ.100 కోట్ల రూపాయల విలువైన చైనా వస్తువులను భారతీయులు కొంటున్నారట. 
 
ఒకవేళ ఇవి కొనడం మనమంతా మానేస్తే.. అప్పటికప్పుడు చైనా రోజుకు రూ.100 కోట్లు నష్టపోతుంది. ఇది ప్రత్యక్షంగా కనిపించే నష్టం. పరోక్షంగా ఆ దేశంలోని ప్రజలు ఉపాధిని కోల్పోతారు. ఆ దేశం ఆర్థికంగా బలహీన పడుతుంది. చైనాలో తయారయ్యే వస్తువులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతాయి. చాలా దేశాల్లో చైనా వస్తువులపై నిషేధం అమల్లో ఉంది. పైగా మన దేశమంత పెద్ద మార్కెట్‌ చైనాకు మరొకటి లేదు. మనదేశంలో అమ్మే వస్తువులతోనే చైనా మనుగడ సాగిస్తుందని చెప్పినా అతిశయోక్తి లేదు. 
 
ఇప్పుడు ఆ వస్తువులే అమ్ముడుపోకపోతే.. ఇంతకంటే పెద్ద యుద్ధమేదైనా ఉంటుందా అందుకే మనమంతా ఇప్పుడు ప్రతిజ్ఞ చేయాల్సిన సమయం వచ్చింది. ‘నో టు చైనా ప్రోడక్ట్స్‌’ అని చెప్పే సమయం ఆసన్నమైంది అంటున్నారు మహారాష్ట్ర స్కూళ్ల ఉపాద్యాయులు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments