Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్త చనిపోయింది.. ఖుషీ ఖుషీగా భార్య.. భర్త ఏం చేశాడంటే..?

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (10:57 IST)
అత్తకోడళ్లంటేనే ఎలా వుంటారో అందరికీ తెలిసిందే. జగడాలు, వాగ్వివాదాలు లేని అత్తాకోడళ్లు వుండరనే చెప్పాలి. ఇలా అత్త చనిపోయిందని ఏమాత్రం బాధ లేకుండా ఓ కోడలు.. ఖుషీ ఖుషీగా తిరిగింది.


హ్యాపీగా అత్తపోయిందని ఊపిరిపీల్చుకుంది. భార్య ఇలా అమ్మ చనిపోయినందుకు సంతోషపడటాన్ని ఆమె భర్త జీర్ణించుకోలేకపోయాడు. అంతే ఆగ్రహంతో ఆమెను రెండంతస్తుల మేడపై నుంచి తోసేశాడు. పశ్చిమ మహారాష్ట్రలోని జునారాజ్‌వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన సందీప్‌ లోఖండే, శుభంగి లోఖండే (35)లు దంపతులు. సందీప్‌ తల్లి మాలతి కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె మార్చి 9వ తేదీన ప్రాణాలు కోల్పోయింది. తల్లి మృతి చెందడంతో సందీప్ విషాదంలో మునిగిపోయాడు. అలాంటి సమయంలో ఓదార్చాల్సిన భార్య అత్త మృతిపై సంతోషం వ్యక్తం చేసింది. ఇక సందీప్‌కు కోపం కట్టలు తెంచుకుంది. 
 
అంతే శుభంగిని మేడపై నుంచి తోసేశాడు. రెండంతస్తులపై నుంచి పడడంతో శుభంగి అక్కడికక్కడే మృతి చెందింది. తొలుత శుభంగిది ఆత్మహత్యగా భావించారు. అత్త మరణం తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని మీడియా కూడా కవర్ చేసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సందీప్ రెండో అంతస్థు నుంచి శుభంగిని కోపంతో తోసేయడంతో ఆమె మరణించినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments