లతా మంగేష్కర్ మృతి : 7న సెలవుదినం ప్రకటించిన మహారాష్ట్ర

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (19:02 IST)
గాయని లతా మంగేష్కర్ మృతితో యావత్ సంగీత ప్రియులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆమె తన గానామృతంతో యావత్ భారతాన్నే కాదు ప్రపంచ దేశాలను సైతం ఆకట్టుకున్నారు. ఆమె మృతిపట్ల పలువురు తీవ్ర తిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే, లతా మంగేష్కర్ మృతికి సంతాప సూచకంగా మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరోవైపు, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా అరపూట సెలవు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తర్వులు జారీచేసింది. 
 
ప్రభుత్వ లాంఛనాలతో లతాజీ అంత్యక్రియలు 
గాన కోకిల, భారతరత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ముంబైలోని శివాజీ పార్కులో జరిగిన ఈ అంత్యక్రియల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, లతా మంగేష్కర్‌కు ఆఖరిసారి నివాళులు అర్పించారు. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా హాజరయ్యారు. 
 
గత నెలలో కరోనా వైరస్ బారినపడిన లతా దీదీ అప్పటి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆమె ఆరోగ్యం విషమించి ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 
 
ఒకవైపు కరోనా వైరస్, మరోవైపు న్యుమోనియాతో పాటు అంతర్గత అవయవాలు పాడైపోవడం వల్ల ఆమె చనిపోయారని ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆమె పార్థివ దేహాన్ని తొలుత ఆస్పత్రి నుంచి ప్రభుకుంజ్‌లోని ఆమె నివాసానికి తరలించారు. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. 
 
ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, బాలీవుడ్ స్టార్స్ షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి బడా హీరోలు కూడా పాల్గొని లతా దీదీని కడసారి చూసి నివాళులు అర్పించారు. 
 
ఇదిలావుంటే, లతా మంగేష్కర్ మరణానికి సంతాపంగా జాతీయ పతాకాన్ని రెండు రోజుల పాటు అవనతం చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. ఆది, సోమవారాలు త్రివర్ణ పతాకాన్ని దేశ వ్యాప్తంగా సగం ఎత్తులోనే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments