Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్: బీజేపీ వర్గాలు!!

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (17:07 IST)
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ఎంపికయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ దిశగా బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తోంది. అయితే ఆయన పేరు ఎంపికపై భారీ కసరత్తే జరుగుతోందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై సోమవారానికి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెపుతున్నాయి. 
 
ప్రస్తుతం మహారాష్ట్ర సీఎంగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ కొనసాగుతున్నారు. ఆయనే మహారాష్ట్ర సీఎంగా ఎంపిక కావొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత ఆదివారం నాటి ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మాత్రం సాధించలేకపోయింది. బయటి నుంచే మద్దతిస్తామంటూ ఎన్సీపీ చేసిన ఆఫర్‌ను అటు వద్దనలేక, ఇటు కాదనలేక బీజేపీ సందిగ్ధంలో పడిపోయింది. 
 
మద్దతు విషయంలో శివసేన నాన్చుడు ధోరణి, ఆ పార్టీని చికాకుకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సమయం పెరిగేకొద్ది కొత్త ముఖాలు సీఎం రేసులోకి రావడం సహజం. అయితే మహారాష్ట్రలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తొలి నుంచి సీఎం రేసులో ముందువరుసలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ను బరి నుంచి వెనక్కు నెట్టే నేత ఇప్పటిదాకా కనిపించక పోవడంతో ఆయన పేరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments