Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో బీజేపీ ప్రముఖులు వీరే...

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (13:09 IST)
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ.. సొంతగా ప్రభుత్వ ఏర్పాటుకు అడుగు దూరంలో వచ్చి ఆగింది. అయినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. దీంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు పలువురు సీనియర్ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ప్రకాష్ జవదేకర్, మహారాష్ట్ర బీజేపీ చీపఫ్ దేవేంద్ర ఫడ్నవిస్, దివంగత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ ముండేలో ముందు వరుసలో ఉన్నారు. 
 
అయితే, బీజేపీ తరపున కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మహారాష్ట్రకు తదుపరి ముఖ్యమంత్రి కావచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో వందకు పైగా ర్యాలీలు చేసి విజయంలో కీలకపాత్ర పోషించిన గడ్కరీ... తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేదనడంతో ఇతరులు పోటీ పడుతున్నారు. 
 
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌ పేరు కూడా సీఎం రేసులో ప్రముఖంగా వినపడుతోంది. వివాదాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ గల యువనేతగా పార్టీ అధిష్టానాన్ని ఆయన ఆకర్షించారు. సీఎం రేసులో వినపడుతున్న మరో పేరు వినోద్‌ తావ్‌డే. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టగలిగే చురుకైన యువనేతగా తావ్‌డే గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, పంకజా ముండే పేర్లపై కూడా చర్చ సాగుతోంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments